ప్రభన్యూస్ : బస్తీల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో 32బస్తీ దవాఖానాలను ప్రారంభించేందుకు సిద్దమైంది. ఈ నేపధ్యంలో సికింద్రబాద్ ఓల్డ్‌బోయినపల్లిలోని శాంతినికేతన్ కమ్యునిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను నిన్న వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్‌రావు ప్రారంభించగా, జూబ్లిహీల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్‌పేట్ రాజీవ్‌గాంధీ నగర్‌లో దవాఖానాను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వీరితో పాటు ఇతర మంత్రులు ప్రజా ప్రతినిధులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 32 నూతన బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దవాఖానాకు వచ్చిన వారిని వ్యాక్సిన్ వేసుకున్నారా అని అడిగి తెలుసుకొని, వ్యాక్సిన్‌ను వెంటనే వేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా దవాఖానా ప్రారంభోత్సవాన్ని పంచుకుంటూ.. వీటిలో ఓపిడి కన్సల్టేషన్, టెలి కన్సల్టేషన్, ప్రాథమిక ల్యాబ్ డయాగ్నస్టిక్స్ చేయటంతో పాటు ఎన్నో రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నయని తెలిపారు. వీరితో పాటు.. గోఫామహల్ నియోజకవర్గంలోని ధూల్‌పేట చంద్రకిరణ్ బస్తీలో దవాఖాలనాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించగా.. ఖైరతాబాద్ మహాభారత్‌నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital