Friday, November 22, 2024

రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు – అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ గోపి సూచన

కరీంనగర్రా – రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురవనున్న సందర్భంగా జిల్లా ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. గోపి తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్షాభావ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ లతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ బి. గోపి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందని, కావున ఎటువంటి సంఘటనలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు

.లోతట్టు ప్రాంతంలో, చెరువులు, వాగు తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలనీ, వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలేవరు చెరువులు, కుంటలా వద్దకు వెళ్లకుండా చూడాలని, వరద నీరు వచ్చే ప్రాంతాలు, మత్తడులు దూకే ప్రాంతాల వద్ద, మరియు నీరు అధికంగా ఉండే చెరువుల వద్ద ఎవరు చేపలు పట్టడానికి వెళ్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ఉన్న ప్రజల సాయానికి జిల్లాలో కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4731 మరియు కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ నెంబర్ 9849906694 నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 24గంటలు గంటలుఅత్యవసర సేవల కొరకు ప్రజలు సంప్రదించ వచ్చనికలెక్టర్ తెలిపారు.

రాబోయే రెండు రోజులు ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ట్రైని కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో,ఇరిగేషన్ ఈ ఈ శివకుమార్, డీపీవో వీర బుచ్చయ్య, మున్సిపల్ శాఖ ఎస్ ఈ,డిఆర్డిఓ శ్రీలత,డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న డి ఏ ఓ శ్రీధర్,డిఐఓ అస్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement