Tuesday, November 26, 2024

KNR: పోరాట యోధురాలు ఐలమ్మ.. సీపీ సుబ్బారాయుడు

కరీంనగర్ : పీడిత ప్రజల కోసం చాకలి ఐలమ్మ అనేక పోరాటాలు చేసిందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు తెలియజేశారు. మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చాకలి ఐలమ్మగా పిలవబడే చిట్యాల ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని, విసునూరు దేశ్ ముఖ్ అయిన రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా భూ పోరాటం చేసిన గొప్ప యోధురాలని పేర్కొన్నారు. ఆ కాలంలో పీడిత ప్రజల కోసం ఆమె పోరాటం చేసిందన్నారు. సామాజిక ఆధునిక పరిణామం కోసం నాంది పలికిన ధైర్యశాలి అన్నారు. 2022వ సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రాజు, లక్ష్మీనారాయణ, ఏ.వో మునిరామయ్య, ఏసీపీ ఏ.ఆర్.ప్రతాప్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్స్పెక్టర్, ఐటీ సెల్ ఇంచార్జి సరిలాల్, ఆర్ఐ లు సురేష్, రజినీకాంత్, కుమారస్వామి, శేఖర్ బాబు, శ్రీధర్ రెడ్ది, సీపీవో కార్యాలయ సెక్షన్స్ కి చెందిన సూపరింటెండెంట్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement