ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ప్రజలందరికి ఆదర్శప్రాయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం కాళోజీ నారాయణ రావు వర్థంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన రచనలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వదిలారని తెలంగాణ యాస పదాలతో ఈ నేలకు తన కలంతో సుసంపన్నం చేశారన్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన మహాకవి అని గుర్తుచేసుకున్నారు.