మద్దిరాల, నవంబర్ 26 ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని, ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందించాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని పోలుమల్ల ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, త్వరితగతిన ధాన్యం కాంటాలను వేగవంతం చేసి రైతుల ఖాతాలో డబ్బులు పడే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఏ పీడీ అప్పారావు, మండల స్పెషల్ ఆఫీసర్ నాగయ్య, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, కేజీబీ స్పెషల్ ఆఫీసర్ తేజశ్రీ, ఐకెపి నిర్వాహకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.