కామారెడ్డి, (ప్రభన్యూస్) : కామారెడ్డి పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహంను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించారు. వసతి గృహంలోని వసతులను, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించారు. గదులు శిథిలావస్థకు చేరడంతో వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని, ఇష్టంతో చదివితే ఏదైనా సాదించగలరు అని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివద్ధి అధికారి అంబాజీ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily