Friday, November 22, 2024

రాయన్ పల్లి ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మెదక్ రూరల్, జులై 26 ప్రభాన్యూస్ జిల్లా లో కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు ప్రాజెక్టులు దాదాపు పుష్కలంగా నీరు చేరడంతో బుధవారం మెదక్ మండలం రాయన్ పల్లి ఆయకట్టను జిల్లా కలెక్టర్ పరిశీలించారు , ఆయకట్టనిండి ఆలుగు పారడాన్ని వీక్షించారు. . చెరువు నేటి పారుదల వివరాలు నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు . ప్రాజెక్ట్ సామర్థ్యం 1200ఎకరాలకు సాగు నీరి అందిస్తుందని , 230 MCFT, దీని ద్వారా వచ్చే కట్టు కాలువలలో మెదక్ లోని దాదాపు 5 చెరువులు నిండుతాయని కొమాటూరు చెరువు నిండిందని ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ కు తెలిపారు .


ఇటీవల కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమతంగాఉండాలని గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని, వ్యక్తి గత శుభ్రతే ముఖ్యమని తెలిపారు. పరిసరప్రాంతాలలో మురికి నీరు నిలువలు లేకుండా చూసుకోవాలని ఎక్కడపడితే అక్కడ మూత్ర, మలవిసర్జన చేయకూడదని , చిన్న పిల్లలు , వృద్ధుల ఆరోగ్య లపై శ్రద్ద వాహినచాలని అన్నారు .

ఈ కార్య క్రమంలో నీటిపారుదలశాఖ ఇంజనీర్లు ఎస్ ఈ యేసయ్య , ఈ ఈ శ్రీనివాస్ , Dy EE శివ నాగరాజు , తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ , గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement