Wednesday, November 20, 2024

NZB : ఎన్నికల పరిశీలకులకు స్వాగతం పలికిన కలెక్టర్, సీ.పీ

నిజామాబాద్ సిటీ,నవంబర్ 10 (ప్రభ న్యూస్):
రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి లు శుక్రవారం నిజామాబాద్ రోడ్లు,భవనాల శాఖ అతిథి గృహంలో కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ గౌతమ్ సింగ్(ఐ.ఏ.ఎస్), వ్యయ పరిశీలకులు పాటిల్ చిన్మయి ప్రభాకర్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ లలిత్ నారాయణ్ సింగ్ సందు(ఐ.ఏ.ఎస్)లను కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల గురించి కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకై చేపడుతున్న కార్యకలాపాల గురించి తెలియజేశారు.

ఫిర్యాదులు, సలహాలు, సూచనలకై పరిశీలకులను సంప్రదించవచ్చు: కలెక్టర్
జిల్లాలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా పాటిల్ చిన్మయ్ ప్రభాకర్ ఉన్నారని, ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయదలచిన వారు అబ్జర్వర్ సెల్ నెంబర్ 8332021903 కు ఫోన్ చేయవచ్చని, సాధారణ పరిశీలకులుగా ఉన్న గౌతమ్ సింగ్ ను, సెల్ : 8332021749 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. వీరిని నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రతిరోజూ సాయంత్రం 4.00 నుండి 5 .00 గంటల మధ్యన నేరుగా కలువవచ్చని తెలిపారు. అదేవిధంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులైన ఏ.శక్తి ని సెల్: 8332021809 ద్వారా, సాధారణ పరిశీలకులు ఎం.సుబ్రా చక్రవర్తిని సెల్: 8332021738 ద్వారా సంప్రదించవచ్చని, ఎస్సారెస్పీ గెస్ట్ హౌస్ లో వీరు నిర్దేశిత సమయంలో నేరుగా కలువవచ్చని సూచించారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు తాన్యాసింగ్ ను సెల్ : 8332021892 కు ఫోన్ చేసి, సాధారణ పరిశీలకులు లలిత్ నారాయణ సింగ్ సందు ను సెల్: 8332025758 కు ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని, బోధన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో సాయంత్రం 4 .00 నుండి 5 .00 గంటల మధ్యన నేరుగా కలువవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అబ్జర్వర్లు జిల్లాలోనే ఉండి ఎన్నికల సంబంధిత అంశాలను పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement