ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరం తడిసి ముద్దయింది. అలాగే గోడలు కూడా నానుతున్నాయి. మంగళవారం ఉదయం ఎల్బీ స్టేడియం ప్రహరీ కూలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలపై శిథిలాలు పడిపోవడంతో ధ్వంసమయ్యాయి.
బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి ఆనించి ఉండడంతో చాలా మంది వాహనాలు అక్కడే పార్క్ చేస్తూ ఉంటారు. అక్కడ పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. గోడ కూలే సమయంలో ఎవరు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -