తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రతతో అల్లాడుతున్న విద్యార్థుల కోసం… పాఠశాలల వేళలను మారుస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పనివేళలను మారుస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
మారిన సమయాల ప్రకారం… పాఠశాల పని వేళలను ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్ణయించారు. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి (డిసెంబర్ 19) అమల్లోకి రానున్నాయి. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు చలి తీవ్రత తగ్గే వరకు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల పని వేళలను గురువారం నుంచి మార్చనున్నారు.