తెలంగాణ ఎన్నికలలో ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాదించిన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రతినిదుల బృందం గవర్నర్ తమిళిసైను కోరింది.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ఇతర సీనియర్ నేతలు తెలంగాణ రాజ్ భవన్ కు గవర్నర్ తో భేటి అయ్యారు.. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ బృందం అందజేసింది. దీనిని పరిగణనలోకి తీసుకునని సిఎల్పీనేత రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇది ఇలా ఉంటే రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేయనున్నారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ను వారు కోరారు.
Governor – ప్రభుత్వ ఏర్పాటునకు కాంగ్రెస్ ను ఆహ్వానించండి …గవర్నర్ కు లేఖ..
Advertisement
తాజా వార్తలు
Advertisement