Saturday, November 23, 2024

టాస్క్‌తో కోకాకోలా ఒప్పందం.. 10వేల మంది కాలేజీ విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌తో) హిందుస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్‌ కార్పొరేషన్‌(హెచ్‌సీసీబీ)తో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రానున్న రోజుల్లో తెలంగాణలోని 10వేల మంది కాలేజీ విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో టాస్క్‌తో కలిసి హెచ్‌సీసీబీ శిక్షణనివ్వనుంది. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యక్షంగా పట్టణ ప్రాంత విద్యార్థులకు వర్చువల్‌ పద్ధతిలో శిక్షణనివ్వనున్నారు. ఈ ఎంవోయూలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో తొలిబ్యాచ్‌ 100 మంది విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌, హెచ్‌సీసీబీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement