Home తెలంగాణ‌ NLG | సీఎం ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

NLG | సీఎం ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

0
NLG | సీఎం ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

మునుగోడు, డిసెంబర్7 (ఆంధ్రప్రభ): సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ‌ నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.

సీఎం పర్యటన దృష్ట్యా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందన్న సమాచారంతో మండలంలోని పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ మండల నాయకులు ఐతగోని విజయ్ గౌడ్, పందుల సురేష్, బీజేపీ అధికార ప్రతినిధి మాదగోని నరేందర్ గౌడ్ లను ముందస్తుగా అరెస్టు చేశారు.

Exit mobile version