Friday, November 22, 2024

Peddapalli: ఆపదలో ఆపద్బంధువుగా సీఎంఆర్ఎఫ్..ఎమ్మెల్యే దాసరి

నిరుపేదలకు ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఆపద్బంధువుగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 137 మంది లబ్ధిదారులకు 39,06,700 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… నిరుపేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సంబంధిత రసీదులతో దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ నుండి ఆర్థిక చేయూతని అందిస్తున్నామన్నారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు.

నియోజకవర్గంలో అనారోగ్యాల బారిన పడిన వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత నందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ పేదలకు ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. మాత శిశు కేంద్రాలను ఏర్పాటు చేసి, గర్భిణీలకు ఉచిత వైద్యం అందించడంతో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సహకార సంఘం ఛైర్మెన్ లు, మార్కెట్ ఛైర్మెన్ లు, డైరెక్టర్ లు, పట్టణాధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో ఆప్షన్ లు, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు లబ్ధిదారులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement