Monday, January 6, 2025

CMR బాత్‌రూమ్‌లో వీడియోలు – ఆందోళ‌న ఉదృతం చేసిన విద్యార్ధినులు

హైద‌రాబాద్ -బాత్ రూంలో సెల్ ఫోన్ తో వీడియోలు తీసిన వారిని త‌క్ష‌ణం అరెస్ట్ చేయాలంటూ గ‌త రాత్రి నుంచి మేడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. త‌మ‌కు హాస్టల్‌లో తమకు భద్రత కరువైందంటూ ఆరోపిస్తున్నారు. బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యార్ధినుల ఆందోళ‌న‌తో రాత్రి అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు క్యాంపస్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, 31న సెలబ్రేషన్స్‌లో భాగంగా హాస్టల్‌లో డీజే ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ తర్వాత అమ్మాయిలంతా హాస్టల్‌కు వెళ్లిన టైమ్‌లో బాత్‌ రూమ్‌లో కెమెరాను గమనించి కంప్లైట్ చేశారు. హాస్టల్ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై చేతిగుర్తులు ఉన్నట్టు గుర్తించారు.. బయటి నుంచి కెమెరా పెట్టినట్టుగా అద్దంపై గుర్తులు ఉండగా . రాత్రి ఒంటిగంటకు కెమెరాను ఓ విద్యార్థిని గుర్తించింది. రెండుమూడు చోట్ల కెమెరాలు పెట్టినట్టుగా విద్యార్ధినిలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలిసి ఉద‌యాన్నేమేనేజ్మెంట్ కు విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. అయితే వారి నుంచి స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డంతో గ‌త రాత్రి నుంచి క్యాంప‌స్ లో ఆందోళ‌న చేప‌ట్టారు. విద్యార్ధినుల ఆందోళ‌న‌లో స్టూడెంట్స్ యూనియ‌న్స్ కూడా బాగ‌స్వాముల‌య్యాయి..

- Advertisement -

బాత్ రూమ్ లో వీడియో తీశార‌న్న విష‌యం తెలుసుకున్న విద్యార్ధినులు తల్లిదండ్రులు క‌ళాశాల‌కు వచ్చారు.. వీడియోలపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. ఇదే స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకున్న ఎసిపితో విద్యార్దినుల‌,త‌ల్లిదండ్రులు మాట్లాడారు.. జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాల‌ను ఆయ‌న సేక‌రించారు. గతంలోనే తమ సమస్యలను యాజ‌మాన్య దృష్టికి తీసుకెళ్ల‌మ‌ని, అయినా . అయినా సరైన యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేద‌ని ఎసిపికి స్టూడెంట్స్ తెలిపారు.. ఇప్పటికైనా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని.. తమకు సరైన న్యాయం జరిగేలా చేయాలన్నారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. దీంతో ఎసిపి మాట్లాడుతూ,ఇప్ప‌టికే అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. వీడియోలు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ప్ర‌త్యేక చ‌ర్చ‌లు తీసుకుంటామ‌ని విద్యార్ధినులకు ఎసిపి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్దినులు కొంత శాంతించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ప్ర‌త్యేక దృష్టిసారించి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్ధినుల వాద‌ల

  1. రాత్రిపూట లేడీస్‌ హాస్టల్‌వైపు అబ్బాయులు వస్తున్నారు
  2. హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదు
  3. లేడీస్‌ హాస్టల్‌కి, వర్కర్స్‌ ఉండే ప్లేస్‌కి మధ్య అడ్డుగోడ లేదు
  4. కంప్లైంట్ చేస్తే బాధితులనే తప్పుపడుతున్నారు.. ఉద్దేశపూర్వకంగా మేమిచ్చిన ఆధారాల్ని చెరిపేశారు..
  5. సరైన మేనేజ్‌మెంట్‌ లేదు.. సరైన సెక్యూరిటీ లేదు..
  6. హాస్టల్‌లో వార్డెన్ సిస్టం కూడా సరిగా లేదు
  7. వీడియోలపై గ‌తంలోనే ఫిర్యాదు చేశాం.. ప‌ట్టించుకోలేదు
Advertisement

తాజా వార్తలు

Advertisement