Friday, November 22, 2024

CM Tour -నేడు సొంత జిల్లా పాలమూరులో రేవంత్ పర్యటన

పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో రోజులు గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. అందులో భాగంగానే స్వయంగా తెలంగాణ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.

మొన్న వరంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ను మరో హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్షించనున్నారు.

ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు సీఎం సమీక్షలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. అన్ని ఏర్పాట్లను తానే స్వయంగా చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement