Tuesday, November 19, 2024

CM Tour – ద‌క్షిణ కొరియాలో అడుగుపెట్టిన రేవంత్ బృందం

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకున్న ఆయన నేటి ఉద‌యం దక్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ కు చేరుకున్నారు. . మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా రేవంత్ వెంట దక్షిణ కొరియా వెళ్లారు. కొరియా చేరుకున్న సిఎం మాట్లాడుతూ, అమెరి కా పర్యటన విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు. అమెరికాకు కొత్త తెలంగాణను పరిచయం చేశామని రేవంత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న అమెరికా భారీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.

కొరియా ప‌ర్య‌ట‌న‌లో..

ఇక కొరియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రేవంత్ రెడ్డి నేడు యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం కూడా రేవంంత్ బృందం పాల్గొన‌నుంది. ఎల్ఎస్ హోల్డింగ్స్ కంపెనీతో ఆయన సమావేశంలో పాల్గొంటారు. త‌ర్వాత హ్యుందాయ్ మోటార్స్ సీనియర్ నాయకత్వాన్ని కలవనున్నారు. వాటర్ సర్క్యులేషన్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ జనరల్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతారు.. దక్షిణ కొరియా నీటి వ్యవస్థను పరిశీలించేందుకు ఈ స్థలాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో కొరియా హెరాల్డ్ పత్రికకు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement