Tuesday, December 3, 2024

NZB: సీఎం ఇచ్చిన‌ మాట నిలుపుకోవాలి… వేముల ప్రశాంత్ రెడ్డి…

భీంగల్ టౌన్, జులై 15 (ప్రభ న్యూస్) : గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పీసీసీ అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్యాణ లక్మీ, షాదీ ముబారక్ ద్వారా అందించే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన మాటను నిలుపుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం భీంగల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 136 మందికి కల్యాణలక్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కల్యాణ లక్మీ పథకం ద్వారా తులం బంగారం అందజేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వారం తరువాత చేసిన వివాహలన్నింటికీ తులం బంగారం ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందించే లక్ష రూపాయలు ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలుపుకొని షాదీ ముబారక్, కల్యాణ లక్మీ పథకం ద్వారా అందిస్తున్న లక్ష నగదుకు తులం బంగారం అదనంగా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement