హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా వాటిపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు.
ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే… సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది.
ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం . అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఉన్న ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చనున్న విషయం తెలిసిందే. అయితే.. భూభారతిపై కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.