హైదరాబాద్ – నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం నగరంలో మెట్రో రైళ్ల సమయాలను పొడిగించారు. దీంతో మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్- రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు మొదలై 1 గంటల వరకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను కోసం టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడపనుంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్- 2024) నేడు ప్రారంభం కానుంది. ఈ ఎగ్జిబిషన్ ను నేటి సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచనంగా ప్రారంభించనున్నారు.. ఇక ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఎగ్జిబిషన్ ను లక్షలాది మంది సందర్శించనున్న క్రమంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. నుమాయిష్ ఎగ్జిబిషన్ టికెట్ ధర ఈ సారి కూడా 40 రూపాయలే ఉండనుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ లోపలకి వారాంతపు రోజులలో సాయంత్రం 4 నుండి రాత్రి 10:30 వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు.