Friday, November 22, 2024

TS: కొడంగ‌ల్‌కు సీఎం…3వేల కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికార బాద్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉనుముల రేవంత్‌ రెడ్డి తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం రాత్రి ముగించుకొని హైదరాబాద్ కి వచ్చారు. నియోజకనవర్గంలో 3 వేల 961 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయనున్నారు.

మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, హైలెవల్ బ్రిడ్జీ, అప్రోచ్ రోడ్డు పనులతో పాటు.. కోస్గీలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ భవన నిర్మాణ పనలకు సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందు కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement