లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. వరుస పర్యటనలు నిర్వహిస్తూ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. కాగా, ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
మధ్యాహ్నం ధర్మపురి జన జాతర సభకు హాజరుకానున్న సీఎం, సాయంత్రం సిరిసిల్ల జన జాతర సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ప్రచారాన్ని ముగించుకొని ఉప్పల్లో నిర్వహించే రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్రెడ్డి తమ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారాన్ని నిర్వహించనున్నారు.