లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ సొంత ఇలాఖాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20న ఆయన మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు 20వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కోసం రేవంత్ ఆ పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆ రోజున రాంపూర్ చౌరస్తా నుంచి కలెక్టర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనుండగా.. ఆ ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత రేవంత్ మెదక్‌కు రావడం ఇదే తొలిసారి. దీంతో స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేరళకు వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి బయల్దేరి కేరళ చేరుకున్నారు. ఈరోజు, రేపు అక్కడ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తిరిగి రేపు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఈనెల 18వ తేదీన మహబూబ్నగర్, మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత రోజు 20న మెదక్ జిల్లాలో పర్యటిస్తారు.