Home తెలంగాణ‌ TG CM | జైపూర్, ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

TG CM | జైపూర్, ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

0
TG CM | జైపూర్, ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. కాగా ఈ పర్యటనలో మొదటి రోజు తన వ్యక్తిగత పనుల నిమిత్తం జైపూర్ వెళ్లనున్న సీఎం.. అనంతరం రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏఐసీసీ పెద్దలను కలిసి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కాగా సీఎం ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్యనేతలు ఉండనున్నారు. అలాగే కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై విన్నవించనున్నారు.

Exit mobile version