Wednesday, January 1, 2025

TG | త్వరలో వనపర్తికి రానున్న సీఎం రేవంత్..

వనపర్తి ప్రతినిధి, (ఆంధ్ర ప్రభ):వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై త్వరలో ముఖ్యమంత్రి.ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తికి రానున్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డితో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు.

నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించిన అంశాలతో పాటు, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటీ రంగాలతో పాటు.. తదితల అంశాలపై కీలకంగా చర్చించారు. ఈ ప్రత్యేక భేటిలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు.

డాక్టర్ మల్లు రవి పాల్గొని పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న ఉద్యోగ మేళా, రుణమేళకు సంబంధించిన అంశాలపై చర్చించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి.ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి వచ్చే తేదీని త్వరలోనే ప్రకటించనున్నామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement