ఇవాళ హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష సమావేశానికి హెచ్‌ఎండీఏ కమిషనర్ దానకిషోర్, హెచ్ఎండీఏ హెచ్‌ఎండీఏ కమిషనర్ అమ్రపాలితో పాటు ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు పాల్గొననున్నారు.
అయితే, గతంలో హెచ్‌ఎండీఏపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. హెచ్ఎండీఏ పరిధిలోని భూములపైన దృష్టి సారించారు. హెచ్‌ఎండీఏకు ఏడు జిల్లాల పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తెలిపాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు హెచ్‌ఎండీఏ భూములపైన ముఖ్యమంత్రికి నివేదికను అందజేసేందుకు హెచ్‌ఎండీఏ కమిషనర్ దానకిషోర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో ఎస్టేట్ విభాగం భూముల లెక్కలను నిగ్గు తేల్చే పనిలో పడింది. ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి హెచ్‌ఎండీఏ భూములపైన సమగ్రమైన నివేదికను అందజేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.