పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఒకవైపు నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నేతలను మేల్కొపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, ఇవాళ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనున్నారు.
ఈ సమీక్ష మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భువనగిరి లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల శామేలు, వేముల వీరేశం, మల్రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలతో పాటు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన కో ఆర్డినేటర్లు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.