Sunday, November 24, 2024

ADB: సీఎం రేవంత్ రెడ్డి తొలి పర్యటన ఇంద్రవెల్లే.. మంత్రి సీతక్క..

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తొలి పర్యటన ఇక్కడి నుంచే జరుగుతుందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మొదటి టూర్ ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించారు.. ఉమ్మడి జిల్లా అభివృది కోసం కృషి చేస్తామన్నారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి బహిరంగ సభ ఉంటుందని ఆమె చెప్పారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం భూమిపూజ చేస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు.

సీఎంకి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉంది.. రేవంత్ రెడ్డి మొదటి సభ, భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు.. అందుకే అధికారంలోకి వచ్చాక మొదటి సభ ఇక్కడ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వాళ్ళు కాంగ్రెస్ కట్టిన కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదు.. ఎమ్మెల్యే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. భూతులు మాట్లాడుతున్నారు.. కావాలని విమర్శలు చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను వాడుకున్నారు.. ఉద్యమ కారులకు గుర్తింపు రాకుండా కుట్రలు పన్నుతున్నారు.. ఉద్యమ పార్టీ కాదు వారిది కుటుంబ పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇంద్రవెల్లి సభకు లక్ష మంది వచ్చే అవకాశం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement