Friday, November 22, 2024

CM Revanth Reddy: ఇవాళ‌ ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష

ఇవాళ‌ ఇరిగేషన్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ దాడులు పై చర్చించనున్నారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

కాగా.. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈనెల 9వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 12 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు కొనసాగాయి. మహదేవ్ పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో అధికారుల బృందం రికార్డులు, విలువైన పత్రాలను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇక మరోవైపు తాజాగా తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. నిన్నటి (11వ) తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికపై కూడా సమీక్ష‌లో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement