Sunday, November 17, 2024

Counter Attack: కేసీఆర్, హరీశ్ రావుకు మంత్రి పదవులిచ్చిందే కాంగ్రెస్…సీఎం రేవంత్​రెడ్డి

అసెంబ్లీలో కేటీఆర్ కాంగ్రెస్​ పై విమర్శలతో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేటీఆర్​ మాటలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్, హరీష్​రావుకు మంత్రి పదువులు ఇచ్చి కాంగ్రెస్​ ప్రభుత్వమేనని చురకలాంటించారు.

కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం స్ఫూర్తి అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ కు అవకాశం కల్పించిందే కాంగ్రెస్ అని తెలిపారు. కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పేర్కొన్నారు. అవకాశం ఇస్తే కేసీఆర్ సింగిల్ విండో చైర్మన్ గా ఓడిపోయారని తెలిపారు. కేసీఆర్ ను కేంద్రంలో షిప్పింగ్ శాఖ, కార్మిక శాఖ మంత్రిని చేసిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. పోతిరెడ్డిపాడుపై గతంలో టి.జనార్ధన్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement