సీఎం రేవంత్‌రెడ్డి జార్ఖండ్‌కు వెళ్లారు. నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఆయన పర్యటించాల్సి ఉండగా జార్ఖండ్ రాజకీయ పరిణామాల దృష్ట్యా కొడంగల్ పర్యటనను రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్ పయనమయ్యారు. మధ్యాహ్నం రాంచీలో జరిగే సభకి సీఎం హాజరు కానున్నారు.
అనంతరం రాహుల్‌గాంధీ చేపట్టిన ‘న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం ఝార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బయలు దేరారు. జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహించారు. వీరంతా సమీర్ పేటలోని లియోని రిసార్ట్‌లో ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం నుంచి తమ రాష్ట్రానికి వెళ్లినవిషయం తెలిసిందే. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లారు.