తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. సింగపూర్ వెళ్లిన సీఎం రేవంత్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్‌మెంట్, టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలపై చర్చించారు.
సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లోనే ఉండనున్న సీఎం రేవంత్ బృందం రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.
- Advertisement -