ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం అవుతారు.
- Advertisement -
ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న 4డీఏలు, 317 జీవో సవరణలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్), ఉద్యోగుల మెడికల్ బిల్లులు, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్‌సీ, జోనల్ వ్యవస్థ తదితర అంశాలపై చర్చించనున్నారు.ఉపాధ్యాయ సంఘాల నాయకులు వచ్చే వారంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని.. పెండింగ్‌లో ఉన్న బిల్లులను కేబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశాలున్నాయని చెప్పారు.