Thursday, January 30, 2025

TG | ప్ర‌పంచ స్థాయి ఎక్స్ పీరియం పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్

శంకర్ ప‌ల్లి : రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్ పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు.

దీనిలో 25 వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్ పీరియం పార్కులో రూ. లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు.

రాందేవ్ రావ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్ పీరియంను తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement