ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవ్వాళ (ఆదివారం) మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్మాపురం వెళ్తున్నారు. అక్కడ పేదల తిరుపతిగా పేరుంగాంచిన కురుమూర్తి జాతరకు హాజరవుతారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తి జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ జాతర దాదాపు నెల రోజులపాటు జరుగుతుంది. కురుమూర్తి జాతరలో ‘‘ఉద్దాలు”(ఉద్దాలోత్సవం) అనే ఉత్సవం వైభవంగా జరుపుతారు. తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతిగా కురుమూర్తి జాతరకు పేరుంది.
- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో కార్తీక మాసంలో ఏటా జరిగే జాతరల్లో ‘కురుమూర్తి’ జాతర ఒకటి. లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో సప్తగిరుల మధ్య ఈ ఆలయం కొలువై ఉంది.
సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన లైవ్ విశేషాలు చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు..