ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవ్వాళ (ఆదివారం) మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్మాపురం వెళ్తున్నారు. అక్కడ పేదల తిరుపతిగా పేరుంగాంచిన కురుమూర్తి జాతరకు హాజరవుతారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తి జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ జాతర దాదాపు నెల రోజులపాటు జరుగుతుంది. కురుమూర్తి జాతరలో ‘‘ఉద్దాలు”(ఉద్దాలోత్సవం) అనే ఉత్సవం వైభవంగా జరుపుతారు. తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతిగా కురుమూర్తి జాతరకు పేరుంది.
తెలంగాణ రాష్ట్రంలో కార్తీక మాసంలో ఏటా జరిగే జాతరల్లో ‘కురుమూర్తి’ జాతర ఒకటి. లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో సప్తగిరుల మధ్య ఈ ఆలయం కొలువై ఉంది.
సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన లైవ్ విశేషాలు చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి లైవ్ అందుబాటులో ఉంటుంది..
Dear Sir/Madam,
Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy will visit Lord Sri Kurumurthy Swamy Temple at Ammapuram, Mahabubnagar District today 10.11.2024.Live Signal will be available from 12:30 PM Please download.