సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ముందుగా యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం దంపతులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు సీఎం దపంతులు ప్రత్యేక పూజలు చేశారు.
ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్టకు రావడంతో.. ప్రొటోకాల్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు.