Tuesday, November 19, 2024

CM REVANTH: కుమారి అంటీకి రేవంత్ భ‌రోసా… ఫుడ్ కోర్టు ర‌న్ చేసుకోవ‌చ్చ‌ని ఆదేశం…

స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.. ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్న చోటే ఫుడ్ అమ్మ‌కాలు కొనసాగించుకోవ‌చ్చంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి ఫుడ్‌ కోర్టును ట్రాఫిక్ స‌మ‌స్య‌తో పోలీసులు బంద్‌ చేయించారు.

దీనిపై ఆమె త‌న జీవ‌నాధారం పోయిదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది… ఆమెను అక్క‌డే ఫుడ్ అమ్ముకోనివ్వాలంటూ సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు ట్విట్ వైర‌ల్ అవుతున్నాయి.దీనిపై ముఖ్య‌మంత్రి రేవంత్ స్వ‌యంగా స్పందించారు.. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా పోలీసులు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. స్వయం ఉపాధి పొందుతున్న పేదలకు ప్రభుత్వపరంగా సాయం అందించేందుకే ప్రయత్నిస్తాం తప్ప వారి ఉపాధిని దెబ్బతీసే పనులు తమ ప్రభుత్వం చేయదన్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎప్పటిలాగే అదే చోట కొనసాగేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తాను కూడా త్వ‌ర‌లోనే కుమారి అంటీ ఫుడ్ కోర్టును సంద‌ర్శిస్తాన‌ని రేవంత్ చెప్పారు.. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement