హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నారు. మరోవైపు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు వివరాలను అందజేయాలని , అలాగే ఆయన అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యఖశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. దీంతో యశోద ఆసుపత్రికి చేరుకున్న రిజ్వీ.. కేసీఆర్‌ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం విషయాన్ని సీఎం రేవంత్‌కు వివరించారు. తుంటి ఎముక విరిగిందని, ఆపరేషన్ చేయాల్సి ఉందని ఆయన సిఎంకు చెప్పారు.. కనీసం నాలుగు నుంచి ఆరు వారాలు హాస్పటల్లోనే చికిత్స పొందాల్సి ఉంటుందని యశోద హస్సటల్ ఇచ్చిన వైద్య నివేదికను రిజ్వీ సిఎం కు అందించారు..
CM Respond – కెసిఆర్ ఆరోగ్యంపై రేవంత్ అరా..హెల్త్ కార్యదర్శిని హాస్పటల్ కు పంపిన రేవంత్
Advertisement
తాజా వార్తలు
Advertisement