ఉమ్మడి మెదక్ (ప్రభ న్యూస్ బ్యూరో): సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మెదక్ సమీకృత కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్ అండ్ బీ, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు.
బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు, పలు విభాగాల అధికారులు ఉన్నారు.
- Advertisement -