Tuesday, November 26, 2024

NZB: పేదలకు వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం… హరీష్ రావు

పేదలకు వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని బిచ్కుంద మండలంలో వంద పడకల ఆసుపత్రి పనులకు మంత్రి భూమిపూజ చేశారు. తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా భావించే వైద్య రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని, బిచ్కుందలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎంతగానో కృషి చేశారని హరీష్ రావు అన్నారు. 26 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి వైద్యం అనేది పేదలకు అందేవిదంగా కృషి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో 30% డెలివరి ల నుండి 76 % నికి పెరిగాయని మంత్రి స్పష్టం చేశారు. నాందేడ్, మహారాష్ట్ర లో 40 మంది పిల్లలు మందులు లేక చనిపోయినరు డబుల్ ఇంజన్ సర్కారు ఏమి చేయలేదు. ఇవాళ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు.


కేంద్ర ప్రభుత్వం దేశంలో157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు, కానీ KCR ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 ఆసుపత్రులు మంజూరు చేసారన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో మన దగ్గర ఉన్న పథకాలు ఉన్నాయా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు వద్దంటున్నాడని, 3 గంటలు సరిపోతదా ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు. ఉచిత కరెంటు అని రాత్రి వేళల్లో కరెంటు ఇచ్చి రైతులకు ఇబ్బంది పెట్టిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పుడు వయ బెంగుళూరుకు చేరిందన్నారు. టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నదని, ముందు టికెట్లు ఇస్తే ఎక్కడ కొట్టుకుంటారో అని భయపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే సౌమ్యుడు ఈసారీ మళ్ళీ గెలుపించి, KCR కు హ్యాట్రిక్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన వెంట జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిండే, నాయకులు రాజు పటేల్, అశోక్ పటేల్, జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement