ధర్మస్థాపనకు నిదర్శనంగా..విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని చెప్పారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం కేసీఆర్ అన్నారు. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ స్పూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని సీఎం ఆకాంక్షించారు. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement