సిద్దిపేటప్రతినిధి, నవంబర్ 3(ప్రభన్యూస్)
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లాకు వెళ్లనున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనయపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పాదల వద్ద సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించనున్నారు.
ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ముందు నామినేషన్ పత్రాలను స్వామివారికి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తారు. ఆరాధ్య దైవంగా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం 10 గంటలకు కొనేపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇది ఆయనకు సెంటీమెంట్. ఈసారి కూడా అదే సెంటీమెంట్‌ను సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ పూజలు నిర్వహించి ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు.