హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులను క్షేత్ర స్థాయిలో వీక్షించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్థులో రెస్టారెంట్, నిరంతరం జ్వలించే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి చూశారు… ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అధికారులకు, నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.
జూన్ లో కేసిఆర్ చేతుల మీదుగా అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం..
Advertisement
తాజా వార్తలు
Advertisement