సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట, యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని సకుటుంబ సమేతంగా.. దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ…. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధికి అధిక నిధులు విడుదల చేసి ఆలయాలను అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ..గొప్ప ఆధ్యాత్మిక వేత్త గా మన సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. దేవాలయాల్లో పనిచేసే బ్రాహ్మణులకు, పూజారులకు గౌరవం లభిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1400 కోట్లతో యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణం చేశారని నభూతో: న భవిష్యత్.. లాగా తెలంగాణ తిరుపతి లాగా భువనగిరి యాదాద్రిని తీర్చిదిదద్దారన్నారు. సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని దేశ ప్రధాని కావాలని, రాష్ట్ర ప్రజలు, సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలు, రైతులంతా పాడి పంటలతో విలసిల్లాలని అందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తుపై ముందు చూపున్న నాయకుడు కేసీఆర్ బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లోకి రాణిస్తారని, బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో.. ఉప్పల దంపతులు..(ఉప్పల శ్రీనివాస్ గుప్తా-స్వప్న), ఐవీఎఫ్- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.