తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పెద్దపెల్లి జిల్లా పర్యటన మినిట్ టూ మినిట్ ఖరార్ అయ్యింది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ భోజనం చేసిన అనంతరం ఎమ్మెల్యే నివాసం నుండి టీఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని 2:40 గంటలకు నూతన తెలంగాణ భవన్ ను ప్రారంభిస్తారు.
ఇక.. 3 గంటలకు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి 3:10 నిమిషాలకు నూతన కలెక్టరేట్ భవనానికి చేరుకుంటారు. జిల్లా సమీకృత భవనాల ప్రారంభోత్సవం అనంతరం 3:40 నిమిషాలకు బయలుదేరి 3:45 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పెద్దపెల్లి జిల్లా ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 8 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ కు చేరుకుంటారు.