Tuesday, November 26, 2024

ఢిల్లీలో కేసీఆర్ బిజీబిజీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. గత ఆరు రోజులుగా ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని సీఎం కేసీఆర్ క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గ‌డ్క‌రీకి సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌నున్నారు. అలాగే వ‌ర‌ద‌ల వ‌ల్ల దెబ్బ‌తిన్న రోడ్ల‌కు నిధులు కోరడంతోపాటు నూత‌న జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంపై విజ్ఞ‌ప్తి చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే మంజూరైన హైవేల‌కు త్వ‌ర‌గా నెంబ‌ర్లు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌నున్నారు. హైవేల నిర్మాణ ప‌నుల్లో వేగం పెంచాల‌ని, నిర్వ‌హ‌ణ‌కు నిధులు కేటాయించాల‌ని గ‌డ్క‌రీని సీఎం కేసీఆర్ కోరే అవ‌కాశం ఉంది. అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్ తోనూ సీఎం భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement