తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రంలో ఎన్డీఏపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నేతలను కలిశారు. కేసీఆర్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి నేతల నుంచి కూడా మద్దతు వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇదే విషయంపై ఈరోజు ఢిల్లీ వెళ్లాలని భావించారు. అయితే, పలు కారణాల వల్ల నేటి పర్యటన వాయిదా పడింది. రేపు కేసీఆర్.. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, పలువురు నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారని సీఎం వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital