కాగజ్ నగర్ టౌన్ -జూన్ 28(ప్రభన్యూస్) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం,అలాగే బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయము ఈనెల 30 వ తేదీన ప్రారంభం కానున్నాయి.. వాటిని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి ఆ రోజు రానున్నారు..
ఈ నేపథ్యంలో కెసిఆర్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండే విట్టల్, జెడ్పి చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుల తో కలిసి నేడు జిల్లా పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు..