Tuesday, November 19, 2024

ఢిల్లీ తరహాలో మన స్కూల్స్​.. సీఎం కేసీఅర్ ప్రత్యేక దృష్టి: ఎంపీ రంజిత్ రెడ్డి

ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయని, వాటి మాదిరిగానే తెలంగాణ‌లో అభివృధి చేయాలని చేవెళ్ల ఎంపీ, దిశ చైర్మన్ డాక్టర్ రంజిత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా అభివృధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డాక్టర్ రంజిత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకే ఢిల్లీ లో సర్కార్ బడులను పరిశీలించడం జరిగిందనీ అక్కడ ఎంతో బాగున్నాయని పేర్కొన్నారు. అధికారుల బృందం వస్తే ఢిల్లీ తీసుకెళ్తానని సూచించారు. మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఅర్ ప్రభుత్వ బడులు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. సర్కార్ బడులు అభివృధి చెందాలంటే దాతలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరం కలిసి కట్టుగా సర్కార్ బడులను అభివృధి చేసుకుందామని ఎంపీ కోరారు.

చేవెళ్ల లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయండి
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రంజిత్ రెడ్డి ఆదేశించారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినందున నిరుద్యోగులకు ఉపయోగపడేలా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రంజిత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో పీఎం జీఎస్ వై పథకంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలనీ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలనీ దిశ కమిటీ చైర్మన్ డాక్టర్ రంజిత్ రెడ్డి ఆదేశించారు..

దిశ క‌మిటీ భేటీకి ఎమ్మెల్యేలు దూరం..
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం దిశ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం దిశ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విఫ్.. శేరి లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ..జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్…జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే లు దూరంగా ఉన్నారు. కీలక సమావేశానికి జూమ్ లో పాల్గొనాల్సి ఉండగా ఒకరు మాత్రమే హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement